

హైదరాబాద్‌లో భారీ వర్షం
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ ఏప్రిల్ 07 – తెలంగాణ : హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా… ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. మాధాపూర్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది