హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

✅ ఔట‌ర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.6500 కోట్లు మంజూరు.

✅ వరంగల్‌కు విమానాశ్రయం తెచ్చామని, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ.

✅ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు.

✅ మహిళాశక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.102.1 కోట్లతో మంజూరు చేసిన 7 ఆర్టీసీ బస్సులను పంపిణీ.

✅ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 48,717 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీగా 92 కోట్ల 74 లక్షల చెక్కును అందజేశారు.

✅ జనగామ జిల్లాలోని 1289 SHG సంఘాలకు రూ.100.93 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.

మనోరంజని ప్రతినిధి వరంగల్ మార్చి 16 – వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌తో సమంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర ప్రాజెక్టులకు రూ.6500 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం వరంగల్‌కు విమానాశ్రయం తీసుకువచ్చామని, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు నిరంతరం కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శివునిపల్లి కేంద్రం నుంచి విర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రూ.102.1 కోట్లతో మహిళాశక్తి పథకం ద్వారా మంజూరైన 7 ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 48,717 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీగా 92 కోట్ల 74 లక్షల చెక్కును అందజేశారు. జనగామ జిల్లాలోని 1289 SHG సంఘాలకు రూ.100.93 కోట్ల రూపాయల చెక్కును కూడా పంపిణీ చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.630.27 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి:

  • రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (కోనాయాచలం గ్రామం, జాఫర్‌గఢ్ మండలం)
  • రూ.5.5 కోట్లతో ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ
  • రూ.45.5 కోట్లతో 100 పడకల ఆస్పత్రి
  • రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్
  • రూ.148.76 కోట్లతో దేవాదుల రెండో దశ, RS ఘన్‌పూర్ ప్రధాన కాలువ లైనింగ్ పనులు
  • 512 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
  • రహదారుల విస్తరణ, సబ్ స్టేషన్ల ఏర్పాటు
    • ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం