హైదరాబాదు బయలుదేరిన నిర్మల్ గ్రామీణ అభివృద్ధి శాఖ బృందం.
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 08 -
హైదరాబాదులో నిర్వహించే మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు వారి సిబ్బందితో కలిసి బయలు దేరారు. ఆ శాఖకు లభించిన అవార్డు అందుకోవడానికి శనివారం గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సిబ్బందితో కూడిన బృందం నిర్మల్ నుంచి హైదరాబాదుకు బస్సులో బయలుదేరింది. నేడు జరగబోయే కార్యక్రమంలో 'షి ఇన్స్ పైర్' ఆరవ ఎడిషన్ అవార్డుల్లో భాగంగా హైబిజ్ అవార్డును అందుకోనున్నారు. హైదరాబాద్ వెళ్లిన వారిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి, ఇతర అధికారు, ఎస్ హెచ్ జి మహిళలు, తదితరులు ఉన్నారు.