

హైదరాబాద్ నగరంలోని గాంధీభవన్ లో టి పి సి సి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ ఫిబ్రవరి 28 మనోరంజని ప్రతినిధి,
శుక్రవారం రోజు హైదరాబాద్ నగరంలోని గాంధీభవన్ లో TPCC విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అధ్యక్షతన జరిగింది,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల మాజీ ఇంచార్జీ దీపా దాస్ మున్షీ,ప్రియతమ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, మరియు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి, మరియు వారితోపాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు,ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల మాజీ ఇంచార్జీ దీపా దాస్ మున్షీ కి ధన్యవాదాలు తెలియజేస్తూ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు,స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలోపేతం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చించడం జరిగింది,ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాట్లాడుతూ,కుల గణన,ఎస్సి వర్గీకరణ మీద చర్చ చేసి,భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుందాం,కార్యకర్తల పోరాట ఫలితమే మనం అధికారం లోకి వచ్చాం,కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు,కేసీఆర్ పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు మనం ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చాం, తెలిపారు.