హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

దయనీయంగా మారిన హెల్త్ అసిస్టెంట్ల జీవన పరిస్థితులు

మనోవేదనతో మరణించిన ఏడుగురు హెల్త్ అసిస్టెంట్లు

సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి

మనోరంజని ప్రతినిధి విశాఖపట్నం మార్చి 18 – కోర్టుల్లో కేసుల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నుండి తొలగించిన 920 మంది కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే వీధుల్లోకి తీసుకోవాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. వైజాగ్ లో సురేష్ బాబు సంఘ ప్రధాన కార్యదర్శి లింగాల రవీంద్ర బాబుతో కలిసి మాట్లాడుతూ కోర్టులో కేసులు వివాదాలు,విద్యార్హతలు,మెరిట్ లిస్టు సమస్యలతో 22 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది హెల్త్ అసిస్టెంట్లను తొలగించడం వల్ల వారి జీవన పరిస్థితులు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన ఉద్యోగులులో చాలామంది 50 సంవత్సరాలు పైగా వయసు కలిగిన వారు ఉన్నారని,వాళ్లంతా పలు రకాల కుటుంబ,ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఉద్యోగాల నుండి తొలగించడంతో మనోవేదనతో ఏడుగురు హెల్త్ అసిస్టెంట్లు మరణించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల నుండి తొలగించి మూడు నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు సమస్య పరిష్కారంపై స్పష్టత లేకపోవడం వల్ల హెల్త్ అసిస్టెంట్లు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకొని ,వాళ్లకు మూడు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.సమస్య పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవాలని సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు.

  • Related Posts

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి.. విశ్రాంత ఉద్యోగి ఏకపాత్రాభినయం… దద్దరిల్లిన కోదాడ వేదిక.. ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం.. తృతీయ బహుమతి అందుకున్న షాద్ నగర్ కళాకారుడు.. విశ్రాంత ఉద్యోగుల అభినందనలు ఆచార్య దేవా.. ఏమంటివి.. ఏమంటివి.. వయోవృద్ధులకు పోటీలో…

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం మనోరంజని ప్రతినిధి విజయవాడ :మార్చి 18 – విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి మూడు రోజులపాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలు జరగనున్నాయి, ఈ మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !