హర్ష సాయిపైనా కేసు – శ్యామలను మరచిపోతారా ?

హర్ష సాయిపైనా కేసు – శ్యామలను మరచిపోతారా ?

బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కారణంగా పలువురు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయన్సర్లపై కేసులు పెడుతున్నారు. విశాఖలో లోకల్ బాయ్ నానిని జైలుకు పంపారు. ఇప్పుడు హైదరాబాద్ హర్ష సాయిపైనా కేసులు పెట్టారు. పేదలకు సాయం చేస్తున్నట్లుగా పబ్లిసిటీ చేసుకుని యూట్యూబర్ గా ఫాలోయింగ్ పెంచుకున్న హర్ష సాయి .. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించినట్లుగా తెలుస్తోంది. పైగా తాను చేయకపోతే వేరే వారు చేస్తారని సమర్థించుకున్నాడు. ఈ క్రమంలో పలువురు హర్షసాయి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ఇంతకు ముందు ఓ సినిమా హీరోయిన్ ఫిర్యాదు చేయడంతో ఆయన పారిపోయి..బెయిల్ వచ్చాక బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా పారిపోతారో లొంగిపోతారో చూడాల్సి ఉంది. ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ పై కూడా కేసులు నమోదయ్యాయి. ఆయన పరారీలో ఉన్నారు. అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ లిస్టులో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా చెలామణి అవుతున్న శ్యామల కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ అండ లేని వారిపైనే కేసులు పెడతారా.. శ్యామల లాంటి వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే పట్టించుకోరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. శ్యామలపై కూడా కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది

  • Related Posts

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత. ఒరిస్సా నుంచి ముంబాయికి 10 కేజీల గంజాయి అక్రమ రవాణా.. ఘట్కేసర్ లో స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు భవనేశ్వర్‌ నుంచి ముంబాయికి కోణార్క్‌ రైల్లో అక్రమంగా రవాణవుతున్న 10 కేజీల గంజాయిని సోమవారం హెచ్…

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు… తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష