స్టూడెంట్ కమిటీలే పాఠశాల విజయానికి మూలస్తంబాలు-

*స్టూడెంట్ కమిటీలే పాఠశాల విజయానికి మూలస్తంబాలు-

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాగుల చంద్రశేఖర్

మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 07 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సోనారి ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి సామాజిక స్పృహ కల్పించడానికి ప్రధానోపాధ్యాయులు బాగుల చంద్రశేఖర్ పాఠశాలలో డిస్ప్లేన్ కమిటీ మీడేమీల్స్ కమిటీ ప్రేయర్ కమిటీ హెల్పింగ్ హాండ్స్ కమిటీల పేరుతో విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే నినాదంగా స్టూడెంట్ కమిటీస్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కమిటీల నిర్వహణ బాధ్యతను 12 మంది విద్యార్థులకు అప్పగించడం జరిగింది.ఈ కమిటీల సభ్యులు ఉదయం పాఠశాలకు వారి వారి గల్లీలలో ఉన్న విద్యార్థులను పాఠశాలకు క్యూలైన్ లలో తీసుకురావడమం అదేవిధంగా పాఠశాల నుండి ఇంటికి వరసక్రమంలో తీసుకురావడం విద్యార్థులు ఆబ్సెంట్ కాకుండా చూడడం విద్యార్థుల చేత సాయంత్రం ఇంటిదగ్గర వారి చేత హోంవర్క్ చేయిస్తూ సామర్థ్యాలను పెంపొందించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం ప్రార్థన సమయం లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల హాజరును సైతం కమిటీ సభ్యులే నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు. మధ్యాహ్న భోజనం టెస్ట్ రిజిస్టర్ ను కూడా మిడ్ డే మీల్స్ కమిటీ సభ్యులే నిర్వహిస్తున్నారని చెప్పారు.పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అభ్యసించడంలో ఆర్థికపరమైన లేదా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే హెల్పింగ్ హాండ్స్ కమిటీ ఆధ్వర్యంలో వారికి సహాయం అందించే విధంగా విద్యార్థులు సమాయత్తం అవుతున్నారన్నారు. పాఠశాల ప్రారంభం మొదలు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు పాఠశాలను విద్యార్థి కమిటీలే నిర్వహిస్తున్నాయని ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ తెలిపారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా తయారు చేయించిన వాలంటీర్ బ్యాడ్జిలను సైతం అందించడం జరిగిందని తెలిపారు.

  • Related Posts

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు….నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జోత్స్నకు ఘన సన్మానం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 – కుటుంబ సభ్యుల సహకారంతోపాటు పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చు అని నిర్మల్ జిల్లా శాస్త్రి నగర్ లో…

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే! మనోరంజని ప్రతినిధి శ్రీశైలం మార్చి 16 -ఏపీలో శ్రీశైలం హైవేలో ట్రాఫిక్ తీరుతెన్నులపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహించనుంది. ఇప్పటికే ఓ సారి సర్వే పూర్తవ్వగా.. రూ.7,668కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

    ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?