

సోన్ సర్కిల్ సిఐ గోవర్ధన్ రెడ్డికి TRSMA జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సన్మానం
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా సోన్ సర్కిల్ నూతన సిఐ గా గోవర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, TRSMA నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సోన్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడడంలో విజయవంతం కావాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబేకర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన కూడా సిఐ గోవర్ధన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ప్రజలకు న్యాయం అందించడంలో అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు