

సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే 8 మంది మృతి?
TG: ఫిబ్రవరి 22న SLBC సొరంగం కూలి 8 మంది చిక్కుకుపోయిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే అందరూ మృతి చెందినట్లు అధికారులు అంచనాకు వచ్చారని, ఈ మేరకు నేడు CMతో జరిగే సమీక్షలో వెల్లడించనున్నట్లు సమాచారం. బురద వల్ల మృతదేహాలు కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, 8మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన విషయం తెలిసిందే. మరోవైపు సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి