సైన్స్ ప్రదర్శన: విద్యార్థుల సృజనాత్మకతకు ప్రోత్సాహం

సైన్స్ ప్రదర్శన: విద్యార్థుల సృజనాత్మకతకు ప్రోత్సాహం

మనోరంజని ప్రతినిధినిర్మల్ : ఫిబ్రవరి 28 :- నిర్మల్ జిల్లా సోన్ మండలం, సిద్ధులకుంట గ్రామ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగాలను ప్రదర్శించారు. తాము రూపొందించిన ప్రయోగాలను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులకు వివరించారు. ఈ ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకతకు దర్పణమని, శాస్త్ర విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. సైన్స్ ఉపాధ్యాయుడు టి. నరేందర్ మాట్లాడుతూ, “శాస్త్ర విజ్ఞానం లేకుండా మానవ జీవనం అసాధ్యం. ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి” అని సూచించారు. విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హరీష్ రెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్, చంద్రశేఖర్ రావు, టి. నరేందర్, బి. నరేందర్, భూమా రెడ్డి, ముర్తూజా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.

    అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 – నిర్మల్ జిల్లా -సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి) అటవీ ప్రాంతంలో గురువారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. బెంగళూరు అసిస్టెంట్ డైరెక్టర్ సమత్ సర్వే నిర్వహించారు. మొక్కల…

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్‌లో ఉన్న వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో గురువారం ముందస్తు హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ పండుగ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.

    అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు