

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి మార్చి 27 -మంచిర్యాల జిల్లా,భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కొరకు బూరుగుపల్లి గ్రామానికి చెందిన ధరవత్ వస్య నాయక్ -నీలా బాయి దంపతులు 40116/-రూపాయలతో ఆలయానికి అవసరమైన వంట సామాగ్రిని విరాళంగా ఇచ్చారు. మరియు బూరుగుపల్లి గ్రామ భక్తులు అందరూ ఇంటికి రెండు కొబ్బరికాల చొప్పున 240కొబ్బరికాయ లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ ఆలయ కమిటీ వారు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు