

సేవాగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణ
సంతోషం వ్యక్తం చేస్తున్న పత్తి కుంట చెరువు ఆయ కట్టు రైతులు
మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చి 24 – మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో పత్తి చెరువుపునరుద్ధరణ కార్యక్రమాన్ని సెహగల్ ఫౌండేషన్ సంస్థ చేపట్టింది. చెరువులలో పేరుకుపోయిన మట్టి, పూటికను తీసి రైతుల పొలాల్లోకి తరలిస్తున్నారు. నల్ల మట్టి రైతుల పొలాలకు తరలించడం ద్వారా భూసారం పెరిగి రైతుకు లాభం చేకూరుతుందని, మరోవైపు మట్టిని రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. అటు చెరువుల పునరుద్ధరణ ఇటు, రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. మరోవైపు చెరువుల పునరుద్ధరణలో భాగంగా కట్ట వెడల్పు పనులను చేపట్టారు., రైతుల పంటల రక్షణ కోసం చర్యలు చేపడుతున్నట్టు వారు తెలిపారు. చెరువు లో 20వేల మిలియన్ లీటర్ల నీటి సామర్థ్యానికి పెంపొందిస్తున్నట్టు సేవగల్ ఫౌండేషన్ అధికారులు తెలిపారు పత్తి కుంట చెరువు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ఆయకట్టు రైతులను సంప్రదించగా ముఖ్యంగా పత్తికుంట చెరువు పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టిన సేవాగల్ ఫౌండేషన్ సంస్థకు మా దామరంచ గ్రామం తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పత్తి కుంట చెరువు మనమత్తులు చేపట్టారు అంటే రైతులం ఎంతో సంతోషిస్తున్నామని గతంలో వర్షాకాలంలోనే పత్తి కుంట చెరువులో నీరును చూసే వారమని సేవాగల్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి చెరువు పనుల తో రానున్న వర్షాకాలంలో చెరువులో నీరు నిండితే చెరువులో పడినటువంటి వర్షపు నీరు వృధా కాకుండా చెరువు చుట్టూ నీరు ఎక్కడ పోకుండా చెరువు కట్టకు తగినటువంటి సామర్ధ్యాన్ని రోడ్డు వేసి నీటిని వృధా కాకుండా పనులను చేపడుతున్నారని వారు తెలియజేశారు సేవగల్ ఫౌండేషన్ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టారని మా గ్రామంలో జరుగుతున్నటువంటి చెరువు కట్ట పునరుద్ధరణ కార్యక్రమాన్ని మండలంలోని చెరువు ఆయకట్ట సమీపంలో ఉన్నటువంటి రైతులు కూడా వారిని సంప్రదించి మీ యొక్క సమస్యలను తీర్చుకోవాలని కోరుకుంటున్నామని వారు తెలియజేశారు
