

సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక
మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం, మర్చి 28,- మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ లొ గల సెంట్ తెరిసా హై స్కూల్ విద్యార్థి నవోదయ ఎంట్రన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరచి సీటుని సంపాదించడం జరిగిందని ప్రిన్సిపాల్ బ్రదర్ ఆంటోనీ తెలియజేశారు, ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బ్రదర్ ఆంటోని మాట్లాడుతూ సెయింట్ థెరిస్సా స్కూల్ ఎప్పుడు విద్యార్థుల భవిష్యత్తుని విద్యార్థుల క్షేమం కోసం ఆలోచిస్తూ ముందుకు సాగుతుందని అందులో భాగంగా నిన్న వెలువడిన నవోదయ పరీక్ష ఫలితాలలో మా పాఠశాలలో చదువుతున్న పూదరి గౌతమి కి సీటు రావడం జరిగిందని తెలియజేశారు, గౌతమి నర్సరీ నుంచి ప్రస్తుత సంవత్సరం వరకు మా పాఠశాలలు చదివిందని, చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండేదని దానికి మా ఉపాధ్యాయ బృందం ఎంతో కష్టపడి విద్యను అందించడం ద్వారా విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్ద గలిగామని, ఇ ఉపాధ్యాయ బృందానికి సిస్టర్ సారా నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడేదని, తల్లిదండ్రులూ కూడా విద్యార్థి మీద ఎంత శ్రద్ధ పెట్టి పాఠశాల లొ చెప్పిన విషయాలను ఇంటి దగ్గర క్రమం తప్పకుండా పాటిస్తూ విద్యార్థిని తగిన సూచనలు చేస్తూ తన భవిష్యత్తుని తన కళ్ల ముందు చూపించే విధంగా తల్లిదండ్రులు ఆ విద్యార్థికి తెలియజేశారు వారిని కూడా మ స్కూల్ నుండి అభినందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది