

సెంట్ జీవియర్స్ స్కూల్‌లో సెయింటిఫిక్ అప్రోచ్ – సీవీ రామన్ జయంతి సందర్భంగా సైన్స్ డే వేడుకలు
🔹 సీవీ రామన్ జయంతి సందర్భంగా సైన్స్ డే కార్యక్రమం
🔹 విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా సైన్స్ ఫెయిర్
🔹 విజేతలకు స్కూల్ ఛైర్మన్ నరసింహారావు చేతుల మీదుగా బహుమతులు
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ | మార్చి 01:- నిజామాబాద్ జిల్లా వర్ని రోడ్‌లో గల సేంట్ జీవియర్స్ స్కూల్‌లో సీవీ రామన్ జయంతి సందర్భంగా సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు వైవిధ్యమైన ప్రయోగాలు, ప్రదర్శనలు నిర్వహించి సైన్స్ రంగంలో తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యాలయ ప్రిన్సిపాల్ లతా గౌడ్ మాట్లాడుతూ, “విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహించామని,” భవిష్యత్తులో వారు డాక్టర్లు, శాస్త్రవేత్తలు కావాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఛైర్మన్ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల శ్రద్ధ, ఆవిష్కరణలు అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు