సీసీ కెమెరాలు నిఘాలో ఇంటర్ మూల్యాంకనం?

సీసీ కెమెరాలు నిఘాలో ఇంటర్ మూల్యాంకనం?

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌:మార్చి 21:- తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈసారి సీసీ కెమెరాలు నిఘా మద్యం మొదలైంది, మూల్యాంకనాన్ని పకడ్బం దీగా నిర్వహించాలని నిర్ణయించిన ఇంటర్ బోర్డు ఈసారి 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిసింది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్షలు గురువారం మార్చి 20తో ముగిశాయి. ఇక ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఉండటంతో అవి మార్చి 22తో ముగియను న్నాయి. మొత్తం 16 రోజులపాటు కొనసాగిన ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగియడంతో విద్యార్ధులు ఇంటిబాట పట్టారు. దీంతో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు విద్యార్ధులతో కిక్కిరిశాయి. ఏడాదిపాటు అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగియడంతో కేరింతలు కొడుతూ సందడి చేశారు. చివరి రోజు పరీక్ష రాసి కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ, హల్‌చల్‌ చేశారు. కాగా మార్చి 5న ఇంటర్‌ పరీక్షలు ప్రారంభ మవగా మార్చి 20వ తేదీతో ముగిశాయి. ఇక అక్కడక్కడ కొందరు విద్యార్ధులు కాఫీయింగ్‌కు ప్రయత్నించడంతో అధికారులు వారిని డీబార్‌ చేశారు. దాదాపు అన్ని పరీక్ష కేంద్రా ల్లో పరీక్షలు ప్రశాం తంగా జరిగాయి. తొలిసారిగా మూల్యాంకన కేంద్రాల్లో బయోమెట్రిక్‌ ..మరోవైపు ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం నుంచే ప్రారంభమైంది. జవా బుపత్రాల మూల్యాంకనం నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్‌బేస్డ్‌ బయోమెట్రిక్‌ హాజరును అమలుచేయాలని నిర్ణయించింది. ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాం కనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లల్లో నిర్వహిస్తున్నారు. మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు మూల్యాం కన ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి సెంటర్‌లో 600 నుంచి 1200 మంది వరకు సిబ్బం ది మూల్యాంకన విధుల్లో పాల్గొంటారు. అలాగే ఇంటర్‌ బోర్డు బీఐఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో వేలిముద్రలు లేదా ఫేసియల్‌ రికగ్నిషన్‌ ద్వారా హాజరు చేయ వచ్చు. ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం అనంతరం మరో పది రోజుల్లో మార్కులను ఎంటర్‌ చేసే ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెనువెంటనే ఫలితాలను ప్రకటిస్తారు

  • Related Posts

    పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు…

    పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు… -పండుగలు భారతీయ సంస్కృతి కి ప్రతికలు… మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చ్ 29; తెలుగువారి నూతన సంవత్సరం (శ్రీ విశ్వ వసు) ఉగాది ఉత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి…

    గోరు బోలి (లంబాడా) భాషకు గౌరవం – తెలంగాణ అసెంబ్లీ చారిత్రాత్మక నిర్ణయం!

    తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా, నిర్మల్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ నేతృత్వంలో మామడ మండలంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Holiday: ఏప్రిల్ 14న పబ్లిక్ హాలీడే ప్రకటించిన కేంద్రం..

    Holiday: ఏప్రిల్ 14న పబ్లిక్ హాలీడే ప్రకటించిన కేంద్రం..

    Central Govt.: ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు.. వేతనం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు..

    Central Govt.: ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు.. వేతనం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు..

    హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం

    హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం

    ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

    ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌