

సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 13 :- నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను గురువారం మాజీ జడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలు, ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులు గురించి చర్చించారు. ఈ సమావేశానికి జిల్లా న్యాయకపోడు జిల్లా ఉపాధ్యక్షుడు ధాత్రి అంజయ్య కూడా హాజరయ్యారు. సీపీ సాయి చైతన్యకు శుభాకాంక్షలు తెలియజేసిన దాదన్న గారి విఠల్ రావు, సహకారం అందించాలని కోరారు.