

సీనియర్లకు చంద్రబాబు ఝలక్!
మనోరంజనిప్రతినిది మార్చి 10 – ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీనియర్లకు చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కనపెట్టేశారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుదీ ఇదే పరిస్థితి. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి నిరాశే మిగిలింది. ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమా మహేశ్వరరావుకూ అవకాశం దక్కలేదు