

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విరాళం అందజేత.
మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.
మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం, సుద్దాల గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయానికి కాంగ్రెస్ నాయకులు 5000 రూపాయల విరాళాన్ని అందించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవ ధూప దీప నైవేద్యం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు
రామగిరి మల్లేష్, పెగుడ గట్టయ్య, మరియు రామగిరి వెంకటస్వామి, కలసి 5000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముని కృపాకటాక్షాలు అందరిపై ఉండి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.