

సీఎం రేవంత్‌పై బాల్క సుమన్ ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత బాల్క సుమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మెప్పు కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే తెలంగాణ నీటి అవసరాలను పట్టించుకోకుండా కృష్ణ నీటిని వదిలేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు