సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..

సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 03: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇన్‌చార్జీ మారిందంటే ఇంకా మారేది సీఎం రేవంత్ రెడ్డేనని ఆయన స్పష్టం చేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘మిషన్ సీఎం చేంజ్’ టాస్క్‌ను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించారని తెలిపారు. అయితే గతంలో తాను ఇదే విషయాన్ని స్పష్టం చేశానని ఆయన పేర్కొ్న్నారు. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్‌లోపు ముఖ్యమంత్రి మార్పు తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. కుంభకోణాలతోపాటు ఇతర ట్యాక్స్‌లపై కాంగ్రెస్ పార్టీలో కథలు, కథలుగా చెప్పుకొంటున్నారన్నారు. అయితే కేబినెట్‌లో కలహాలు నడుస్తున్నాయని తెలిపారు.ఆడబిడ్డల ఆశీర్వాదం అంటే తెలంగాణ ఆడబిడ్డలు కాదని.. ఢిల్లీ ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ చేతిలో తన భవిష్యత్తు ఉందని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. సీఎం మార్పుపై గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చి కేబినెట్‌లోని ఓ నేతలకు ఆ బాధ్యతను అప్పగిస్తారని వివరించారు. మొన్నటి వరకు కన్వర్టెడ్ బీసీ అన్నారని ఆయన గుర్తు చేశారు.ఇక సీఎం రేవంత్ రెడ్డి నరం లేని నాలుక … ఎప్పుడు ఏమైనా మాట్లాడుతాడంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుతో పాటు కేబినెట్‌సైతం గాడి తప్పిందని విమర్శించారు. మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నారన్నారు. రాజు.. సామంత రాజు తరహాలో వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఒక్క మంత్రి సైతం తనను లెక్క చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డే చెప్పుకున్నారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాడని… దాదాపు ఆరేడు నెలల తర్వాత పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇచ్చారని వివరించారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఎవరో తన కుర్చీపై కన్నేశారని చెప్పడమంటే.. రాహుల్ గాంధీ ఎలాంటి ఇండికేషన్ ఇచ్చారో అర్థమవుతుందన్నారు. కొందరు మంత్రులు తన సీఎం కుర్చీపై కన్నేశారని.. కేబినెట్ మంత్రులు తన మాట వినడం లేదన్నారు. సీఎంను పని చేయనీయకుండా, ఆయన కుర్చీపై కన్నేసిందెవరని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు.. ఈ కుర్చీపై కన్నేశారా? అని సందేహం వ్యక్తం చేశారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి వారు సహకరించడం లేదా? అని సందేహం వ్యక్తం చేశారు. వీరి మధ్య మూటల పంచాయితితోనేనా లేక మరేదైనా కారణముందా? అని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే సీఎంను ఎస్ఎల్బీసీ వద్దకు రానీయ లేదన్నారు. తాము వెళ్లి స్టేట్‌మెంట్ ఇస్తే.. ఆ తర్వాత 8 రోజులకు దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారన్నారు. సీఎంకు ఎక్కడికక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్ పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఎప్పటి సమాచారాన్ని అప్పుడు ఢిల్లీకి చేరవేస్తున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారన్నారు. అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో అపాయింట్‌మెంట్ దొరకకుండా చేస్తున్నది సైతం ఉత్తమ్ కుమార్ రెడ్డేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో పార్టీ ఇన్‌ఛార్జీని మార్చడంలో ప్రధాన భూమిక, మాస్టర్ ప్లాన్ అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డిదేనని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డితో గిఫ్ట్‌లు తీసుకొని సపోర్ట్ చేస్తుందని ఓ చర్చ సైతం పార్టీలో సాగుతోందన్నారు

  • Related Posts

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 13 :- అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధిపై చర్చిస్తున్న సమయం లో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వాఖ్యలకు నిరసన గా కడెం కాంగ్రెస్ పార్టీ…

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు కనికరం లేని కాంగ్రెస్ సర్కారుపై కర్షకుడి కన్నెర్ర నీళ్లు ఇవ్వకుంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం అని హెచ్చరిక రైతు ధర్నాకు మద్దతుగా బిఆర్ఎస్ ధర్నాకు బయలు దేరినా సుంకె రవిశంకర్ హౌస్ అరెస్టు చేసిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ