

సీఎం చంద్రబాబుతోనే మహిళలకు సాధికారిత: తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి గుండాలలీలావతి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మహిళా సంక్షేమం సాధికారత భద్రత కోసం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని అనేక పథకాలు కార్యక్రమాలను ప్రారంభించడం శుభపరిణామమని తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మహిళా లోకానికి ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా,సెర్ఫ్, మెప్మా, ఎం ఎస్ ఎం ఈ రంగాలలో మహిళల కోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు.ముఖ్యంగా మెప్మాలో, రాపిడో,స్వయం ఉపాధి పథకాలలో, కేంద్ర ప్రయోజక పథకాలలో,తృప్తి హోటల్లో, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్లలో, టిడ్కో లైవ్లీహుడ్ సెంటర్లలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన ఈ బహుమతికి మహిళలంతా ఆనందంగా ఉన్నారని తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి తెలియజేశారు.టీడీపీ తోనే మహిళా సాధికారత సాధ్యమని తెలిపారు