

సి.బి.ఐ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు?
నెక్స్ట్ ఎవరు?
మనోరంజని ప్రతినిధి
అమరావతి: మార్చి02
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుం డా విదేశాలకు వెళ్లడం, అదేవిధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ప్లానింగ్ కు విరుద్ధంగా విదేశాల్లో పర్యటించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఆలిండియా సర్వీసు నిబంధనలను సునీల్ కుమార్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా నేతృత్వం లో విచారణ కమిటీని ప్రభు త్వం ఏర్పాటు చేసింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్దారణ కావడంతో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయా లని ప్రభుత్వం నిర్ణయిం చింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదివా రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్నప్పుడు, సిఐడీ ఛీఫ్ గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని, అప్పటి ము ఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,కి పూర్తి అనుకూలంగా పనిచేశాడని పీవీ సునీల్ పై మొదటి నుంచి టీడీపీ ఆరోపణలు చేస్తుంది.
అదేవిధంగా మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీక ర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసును సునీల్ కుమార్ ఎదుర్కొం టున్నారు.సీఎస్ విజయా నంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐపీఎస్ అధికా రులకు విదేశీ ప్రయాణానికి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ప్రభుత్వ విధానాల ప్రకారం..
రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇచ్చే హక్కు ఉంది. అయితే, DOPT (2003) మార్గదర్శకాల ప్రకారం ముందుగా అనుమతి తీసు కోవాలి. పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ ముఖ్యమైంది. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు పోలీసు సర్వీసు నిబంధనలకు విరుద్ధం. ఐపీఎస్ అధికా రులు అధిక సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంటారు.
అనుమతిలేని పర్యటనలు జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించవచ్చునని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. అయితే, ముందస్తు అను మతి లేకుండా పలుసార్లు విదేశీ యాత్రలకు వెళ్లినట్లు సునీల్ కుమార్ పై అభియోగాలు ఉన్నాయి.
అఖిలభారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్ కు వ్యతిరేకంగా సునీల్ వ్యవహరించినట్లు భావిస్తూ డీజీపీ ర్యాంకులో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది