

సిరియాలో మళ్లీ చెలరేగిన మారణ హోమం
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 09 – సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్,విదేశీల తిరుగుబాటుతో స్థానికంగా హింస చెలరేగింది, భద్రత దళాలు అసద్, అనుకూల వాదుల మధ్య తీవ్ర ఘర్షణ లు ప్రతికాల దాడులు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న దాడుల్లో దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ట్లు అంచనా….రాజకీయ సంక్షోభం, అంత ర్యుద్దంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో అతిపెద్ద మారణకాండ చోటు చేసుకుంది. భద్రతా దళాలు, బహిష్కరణకు గురైన ప్రెసిడెంట్ బషర్ అసద్, విధేయుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కాస్తా.. హింసా కాండకు దారి తీసింది. 14 ఏళ్ల సిరియా సంక్షోభం లో ఇంత దారుణమైన మారణకాండ చోటు చేసుకో వడం ఇదే తొలిసారని, తెలుస్తుంది. గురువారం మొదలైన ఘర్షణలు మరింతగా ముదరడంతో సిరియాలో ఏర్పడిన కొత్త సర్కారుకు ఇబ్బందిగా మారింది. అసాద్‌ను పదవీచ్యుతుడ్ని చేసిన తర్వాత తిరుగు బాటుదా రులు సిరియాలో అధికా రాన్ని హస్తగతం చేసుకు న్నారు. అయితే బషార్ అసద్ విధేయులే ఈ హింసాకాండ కు బాధ్యత వహించాలని, ఇలాంటి వ్యక్తిగతమైన చర్యలు తగదని కొత్త ప్రభుత్వం అంటోంది. శుక్రవారం ప్రభుత్వానికి విధేయులైన సున్నీ ముస్లింలు ఆయుధాలు చేపట్టి.. అసద్ వర్గానికి చెందిన మైనార్టీలైన అలావైట్ గ్రూపుపై దాడులకు తెగబడ్డారు. దశాబ్దాలుగా అలావైట్ ప్రాంతం అసాద్‌కు సపోర్ట్ బేస్‌గా ఉంటూ వస్తోంది. ఈ ప్రాంతంపై సున్నీ ముస్లింలు దాడి చేసి అలావైట్లను దారుణంగా చంపేశారు. దుకాణాలు, ఇండ్లలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చేశారు. వీధుల్లో, రోడ్లపై ఈ కాల్పుల కారణంగా వందలాది మంది మృతి చెందారు. పైగా అలావైట్ల ఇండ్లలోకి చొరబడి సామాన్లు లూటీ చేశారు. అనంతరం ఇండ్లను తగలబెట్టినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతు న్నారు. ఇక బనియాస్ ప్రాంతంలో కూడా హింసాకాండ చెలరేగింది. అక్కడ ప్రతీ వీధిలో, రోడ్లపై, ఇండ్ల పైకప్పులపై శవాల గుట్టలు పేరుకొని పోయా యి. వాటిని తీసుకొని పోవడానికి కూడా సున్నీ ముస్లింలు ఒప్పుకోలేదని తెలిసింది