

సియం సార్ .. సీతక్క మీ కాళ్ళు మొక్కుతా అక్కా….అదివాసులకు పట్టాలు ఇవ్వండి.
కోమురం భీమ్ కాలనీ ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మనోరంజని ప్రతినిధి కొమురం భీం మార్చి 27 -సియం సార్ …..సీతక్క కాళ్ళు మొక్కుతా…. అదివాసులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వండని రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బావోద్వగానికి గురైనారు. గత పది సంవత్సరాలు గా ఇళ్ళ స్థలాలు కోసం పోరాటం చేస్తున్న కొమురంభీమ్ కాలనీ ని గురువారం నాడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించి వారి గోడు ను విన్నారు.. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లటడుతూ పక్కనే వున్న కొటిశ్వరులకు ఒక న్యాయం పేదలైన అదివాసులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి సీతక్క ల దృష్ఠికి తీసుకవెళ్ళి పరిష్కరిస్సమన్నారు.కొర్డు కేసును సాకుగా చూపి పట్టాలు ఇవ్వకపొవడం తగదన్నారు. చీకటి బతుకులకు వెలుగులు చూపిన మాహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్అని కొనియాడారు. అదివాసులకు అండగా వుంటానాన్నారు.మేము అడవి బిడ్డలం సార్ మేము భయానక పరిస్థితులలో జివిస్తున్నామని ఆదివాసి తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు గణేష్ అన్నారు.ఆరు బొర్లను మేమె వెసుకున్నాం…మాకు కరెంటు లేదు…చీకటిలో వున్నామని కరెంటు సౌకర్యం కల్పించాలని, మంచీనీరు సరఫరా చేయాలని కొరారు.పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం లో కమిషన్ సభ్యులు నీలాదేవి,ప్రవీణ్, జిల్లా శంకర్,లక్ష్మినారాయణ డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్,అర్డిఓ వినొద్ కుమార్,తహసీల్దారు ఎస్సీ డిడి సునీత, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు,డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన,చుంచు రాజేందర్, బ్యాగరి వేణు ,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.