తెలంగాణలో రాజకీయ నేతలు సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఓ వ్యక్తి తనను కలిసి "మీ క్యారెక్టర్‌కు తగిన పాత్ర ఉంది" అని చెప్పడంతో ఆఫర్ స్వీకరించినట్లు వెల్లడించారు."ఈ ఉగాదికి స్టోరీ వింటాను, వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుంది" అని తెలిపారు. ఇంటర్వల్ ముందు ప్రవేశించే తన పాత్ర, సినిమా ముగిసే వరకు కొనసాగుతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే, తాను పీసీసీ, సీఎం అనుమతి తీసుకున్న తర్వాతే సినిమాల్లో నటించనున్నట్లు స్పష్టం చేశారు.ఈ లవ్ స్టోరీ సినిమా విషయంలో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.