

సింగరేణి: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
మనోరంజని ప్రతినిధి మార్చి 20 – పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆర్జి-2 ఏరియా జనరల్ మేనేజర్ వెంకటయ్య అన్నారు. బుధవారం సెక్టార్-3 సింగరేణి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి జీఎం హాజరై విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశారు. సెక్టార్-3 పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు శుక్రవారం నుండి జరిగే పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు