సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

కనికరం లేని కాంగ్రెస్ సర్కారుపై కర్షకుడి కన్నెర్ర

నీళ్లు ఇవ్వకుంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం అని హెచ్చరిక

రైతు ధర్నాకు మద్దతుగా బిఆర్ఎస్

ధర్నాకు బయలు దేరినా సుంకె రవిశంకర్ హౌస్ అరెస్టు చేసిన పోలీసులు

గంగాధర, మార్చి 13 : మనోరంజని

ఒక్క తడికి నీరిస్తే పంటలు పండేవి నోటికాడి బుక్క నేలపాలైందని,కనికరం లేని సర్కారును మునుపెన్నడూ చూడలేదు అంటూ పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు.గురువారం కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంకు చెందిన రైతులు, గంగాధర మండల కేంద్రం మధురనగర్ చౌరస్తా లో జాతీయ రహదారిపై ధర్నా చేశారు.ఈ ధర్నాకు మద్దతుగా చొప్పదండి మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్ బయలు దేరగా ఆయనను గృహ నిర్భంధం చేసారు.నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మద్దతూ తెలుపుతూ వారితో పాటు రోడ్డుపై బైటయించేందుకు ప్రయత్నయించగా పోలీసులు చెదర గొట్టి బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసారు.ఎల్లంపల్లి నుండి నారాయణపూర్ చెరువులోకి నీటిని నింపి తద్వారా కాలువల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.నీరందకపోతే దాదాపు వేలాది ఎకరాలలో పంట నష్టపోతామని రైతులు వాపోయారు.నీళ్లు వదలకపోతే కరీంనగర్‌ కలెక్టరేట్‌, ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దాదాపు 100 మంది రైతులు పాల్గొన్న ఈ ఆందోళనను పోలీసులు జోక్యం చేసుకుని విరమింపజేశారు.నిరసన తెలిపేందుకు వెళితే అరెస్టు చేస్తారాముందుచూపు లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధతతో కాళేశ్వరం జలాలు సకాలంలో అందించక పోవడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని, కాళేశ్వరం జలాలు విడుదల చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అక్కస్సుతో రేవంత్‌ రెడ్డి రైతులను అరిగోస పట్టిస్తున్నాడని మండిపడ్డారు. పదేండ్లుగా నీటి కరువును చూడలేదని, జలాశయాల్లో నీరు ఉన్నా ఇవ్వలేని దద్దమ్మ సర్కారు అంటూ మండిపడ్డారు. ఎండిన పంటలకు తక్షణమే ఎకరాకు 20 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఈ రోజున రైతాంగమంతా ముక్తకంఠంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని గట్టిగా కోరుకుంటున్నారన్నారు. ఆయన పాలనలోననే వ్యవసాయం ఒక స్వర్ణ యుగంగా మారిందని రైతులే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చివరి ఆయకట్టు వరకు నీటి ఇస్తా అని ప్రగల్బాలు పలికాడని, ఈ రోజు అడిగితే రైతులను దాబాయిస్తున్నాడని మండిపడ్డాడు. నువ్వు మేడిపల్లి సత్యం కాదని మేడిపల్లి అసత్యం అని అన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే రైతులను దాబాయించడం కాదు, గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం ఇవ్వాలన్నారు.త్వరలో ఎండిపోయిన పంటలపై రైతులకు బాసటగా నిలిచేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలను తిరిగి రైతులకు అండగా నిలుస్తామన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మా నాయకులు హరీష్ రావు కేటీఆర్ సిద్ధమవుతున్నారని అన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం నిలువలేదన్నారు.
కాంగ్రెస్‌ సర్కారు అబద్దాలతో కాలం గడుపుతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే తరిమితరిమి కొట్టే దుస్థితి చెచ్చుకొంటున్నారు అని అన్నారు

  • Related Posts

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .