సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :- హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథం అదిలాబాద్ పార్లమెంటరీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజలకు తోడ్పడే కార్యక్రమాల గురించి గ్రామ గ్రామాన తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్ చారి, ముధోల్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్, జి. విఠల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్ తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం పై దిశ నిర్దేశం చేశారని పేర్కొన్నారు.