

సత్తుపల్లి మండలం లో అంతర్ రాష్ట దొంగ బీభత్సం..
ఖమ్మం జిల్లా
సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ పై నాలుగు చోట్ల కత్తి దాడి చేసి పరారు అయిన అంతర్ రాష్ట్ర దొంగ.
కానిస్టేబుల్ నరేష్ కు తల భాగంలో రెండు పోట్లు, భుజం భాగంలో రెండు పోట్లు పొడిచిన అంతర్ రాష్ట్ర దొంగ.
ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.చికిత్స అందిస్తున్న వైధ్యులు..
సత్తుపల్లి బస్టాండ్ లో అంతర్ రాష్ట దొంగ అనుమాన స్పదంగా ఉండటంతో గుర్తించిన ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్.
ఐడి పార్టీ కానిస్టేబుల్ ను చూసి బైక్ పై పరారు అయిన అంతర్ రాష్ట దొంగ.
అంతర్ రాష్ట దొంగను వెంబడించి సత్తుపల్లి శివారు లో అడ్డగించిన ఐడి పార్టీ కానిస్టేబుల్.
అడ్డగించిన ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ పై కత్తితో దాడి చేసి పరారు అయిన అంతర్ రాష్ట్ర దొంగ.
పరారు అయిన అంతర్ రాష్ట్ర దొంగ సురేంధర్ ఎన్ టి ఆర్ జిల్లా చాట్రాయి గ్రామానికి చెందిన వాడిగా గుర్తింపు