

సగ్గం గంగాధర్ పదవీ విరమణ – ఔదార్యంగా మ్యూజిక్ ప్లేయర్ విరాళం
మనోరంజని ప్రతినిధి : కుంటాల ఫిబ్రవరి 28 :-జిల్లా పరిషత్ కుంటాల పాఠశాల ఉపాధ్యాయుడు సగ్గం గంగాధర్ గత పది సంవత్సరాలుగా తన సేవలతో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచారు. నేడు (ఫిబ్రవరి 28, 2025) ఆయన పదవీ విరమణ పొందారు. ఈ సందర్భాన్ని మరింత స్మరణీయంగా మార్చేందుకు, పాఠశాలకు రూ.15,000 విలువైన రీఛార్జబుల్ మ్యూజిక్ ప్లేయర్‌ను విరాళంగా అందించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం గంగాధర్ సార్ సేవలను ప్రశంసిస్తూ, విద్యార్థులకు అందించిన మార్గదర్శనం చిరస్మరణీయమని కొనియాడింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు చంద్రనాగ కాంత్, ఉపాధ్యాయులు లక్ష్మణ్, ధర్మాజీ, భోజన, చిన్నారెడ్డి, మారుతీ, భూమన్న, సాహెబ్ రావు, అలాగే కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామస్థులు గంగాధర్ సార్ అందించిన నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ, ఆయన భవిష్యత్తు ఇంకా ప్రశాంతంగా సాగాలని కోరారు
