

సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 15 :- భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్స్‌లో సంస్కార్ స్కూల్ డే మరియు పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామరావు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై, తల్లిదండ్రులకు విలువైన సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలకు మంచి సంస్కారం నేర్పాలని, మొబైల్ ఫోన్లు అందించకూడదని, ఇంట్లో టీవీ చూడకూడదని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల భవిష్యత్తు మెరుగుపడేలా క్రమశిక్షణ, నైపుణ్యాలు నేర్పించాలి అని పేర్కొన్నారు. సైకాలజిస్ట్ శ్రీహరి తిరునగరి గారు “శాండ్విచ్ పేరెంటింగ్” అనే కాన్సెప్ట్‌ను వివరించి, తల్లిదండ్రులు పిల్లలతో ఎప్పుడు కఠినంగా ఉండాలి, ఎప్పుడు ప్రేమతో మెలగాలి అనే విషయాన్ని వివరించారు. 21వ శతాబ్దపు స్కిల్స్ నేర్పించడం ఎంత ముఖ్యమో తెలిపారు. కార్యక్రమంలో భైంసా మండల విద్యాధికారి సుభాష్ , భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ షిండే ఆనంద్ రావు పటేల్ పాల్గొని విద్యార్థుల భవిష్యత్తు రూపకల్పనలో తల్లిదండ్రుల పాత్రపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్కార్ పాఠశాల ప్రిన్సిపాల్ పర్వాజి ప్రకాష్, ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్, నరహరి నాయక్, విశ్వక్ సెన్, సప పండరి (హ్యూమన్ రైట్స్ ఉత్తర తెలంగాణ చైర్మన్), విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సెమినార్ తల్లిదండ్రులకు, విద్యార్థులకు విలువైన మార్గదర్శనం ఇచ్చిందని నిర్వాహకులు తెలిపారు