

సందర్భం వస్తే ఆమరణ దీక్ష చేస్తా: సీఎం రేవంత్
TG: రాష్ట్రంలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్నారని CM రేవంత్ తెలిపారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం 99సార్లయినా ఢిల్లీ వెళ్తా. నా ఢిల్లీ పర్యటనల వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాడతాం. తెలంగాణ కేంద్రానికి కడుతున్న పన్నుల మొత్తం ఎంత? రాష్ట్రానికి వచ్చిన నిధులెన్ని? సందర్భం వస్తే ఈ అన్యాయంపై ఆమరణ దీక్ష చేస్తా’ అని పేర్కొన్నారు