

షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : షాద్‌నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం 2025 క్యాలెండర్‌ను జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంగు రాఘవరావు శనివారం ఆవిష్కరించారు. షాద్‌నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గౌరవరాజుల వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మంగు రాఘవరావు మాట్లాడుతూ, తాను ఎల్లప్పుడూ బ్రాహ్మణులకు అందుబాటులో ఉంటానని అన్నారు. తిధి, వార, నక్షత్రం మరియు సామాన్య ప్రజల రోజువారీ కార్యకలాపాలైన అనేక ఇతర విషయాలను క్యాలెండర్‌లో చేర్చడం అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. బ్రాహ్మణులకు అన్ని రకాల సహాయం మరియు మద్దతును ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ నియోజకవర్గం గౌరవాధ్యక్షుడు రామ సత్యనారాయణ శర్మ, ప్రధాన కార్యదర్శి వసుధర్, కోశాధికారి వేణు గోపాల్, శిరీష, కమల్ కిషోర్, రాధేశ్యామ్, షాద్‌నగర్ టౌన్ ప్రెసిడెంట్ సుజీవన్, ప్రధాన కార్యదర్శి వీణ రమాదేవి,గౌరాజుల గౌరవరాజుల మణి పంతులు, అమ్మి పంతులు, గౌరవరాజుల సాయి పంతులు, గౌరవరాజుల అభి పంతులు , బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు..