షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తా : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తా : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే శంకర్ పిలుపు

భయపడాల్సిన పనిలేదు.. చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి..

ప్రజల్లోకి బలమైన ప్రచారం అవసరం

ప్రతిపక్షాల అర్థరహిత ఆరోపణలను ఖండించండి..

షాద్ నగర్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ కీలక ఆదేశాలు

మేనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 01 : గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా దశల వారీగా నెరవేర్చుదామని, నిర్భయంగా చెప్పిందే చేసేందుకు కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని, చేయాల్సింది ఇంకా చాలా ఉందని, ప్రస్తుతం చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగు నెరవేర్చామని, మరో రెండు హామీలు త్వరలోనే నెరవేర్చుతామని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, గృహ జ్యోతి పథకాలు ప్రజలకు అమలు చేశామని వివరించారు. నియోజకవర్గంలో ప్రభుత్వం కల్పించిన పథకాల వల్ల లబ్ది పొందిన వారి జాబితాను రూపొందించి అందరు మండల పార్టీ అధ్యక్షులకు సమాచారం ఇవ్వాలనే లక్ష్యంతో వారితో సమావేశాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథరకాల పల్ల గ్రామాల్లో 80 నుండి 90 శాతం లబ్ది పొందుతున్నా, జరిగిన లబ్దిని గ్రామస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించలేకపోతున్నారని.. ఇది తీవ్ర ప్రధాన లోపం అంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రచార రూపం కొంత తమవైపు
ఉందని గుర్తు చేశారు.ఇప్పటి వరకు షాద్ నగర్ నియోజకవర్గంలో ఎస్డిఎఫ్ ద్వారా మంజూరైన నిధులు రూ.9.50 కోట్లు కాగా, మహాత్మా గాంధీ ఎస్ఆర్ఎస్ ద్వారా మంజూరైన నిధులు రూ.8.17 కోట్లు, కొత్తూరు మున్సిపాలిటీకి హెచ్ఎర్డీసీఎల్ ద్వారా రూ.50 కోట్లు, రోబ్ వై జంక్షను మంజూరైన నిధులు రూ.184.00 కోట్లు, డబుల్ బెడ్రూమ్ల బ్యాలెన్స్ పనులకు మంజూరైన నిధులు రూ.2.50 కోట్లు, సీఆర్ఆర్ గ్రాంట్స్ ద్వారా రూ.20 కోట్లు, షాద్నగర్ మున్సి పాలిటీకి రూ.39.72 కోట్లు. కొత్తూరు మున్సిపాలిటీకి రూ.3.35 కోట్లు, కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రూ.150 కోట్లు, ఎంఆర్ఆర్ గ్రాంట్స్ ద్వారా మంజూరైనవి రూ.15.35 కోట్లు, ఎస్టిఎస్ఎఫ్ నిధులు రూ.10 కోట్లు, ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు రూ.1 కోటి, సీఆర్ఆర్ఎస్సీపీ ద్వారా రూ.9.99 కోట్లు, మొత్తం రూ.506.33 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. అదేవిధంగా ఇంకా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనల్లో షాద్నగర్ మున్సి పాలిటీకి రూ.50 కోట్లు, సీఆర్ఆర్ గ్రాంట్స్ ద్వారా ప్రతిపాదించిన నిధులు రూ.88 కోట్లు, ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్ నిర్మాణం కోసం రూ.9.20 కోట్లు, ఆర్అండ్ సబ్ డివిజన్ భవనం కోసం రూ.3 కోట్లు, ఆర్అండ్ బీ శాఖ ద్వారా మంజూరైన నిధులు రూ.56 కోట్లు, ఇలా ప్రతిపాదించిన నిధులు మొత్తం రూ.206.2 కోట్లు అని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన రోడ్లకు సంబంధించి రూ.20.5 కోట్లు, షాద్ నగర్ జంక్షన్ నుండి అన్నారం చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.50 కోట్లు ఉన్నాయని, అదేవిధంగా జిల్లేడ్ చౌదరిగూడ, నందిగామ మండల కాంప్లెక్స్ సముదాయం నిర్మాణం కోసం ప్రతిపాదనలు, కొండూరు, కొత్తూరు మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలల మంజూరికి ప్రతిపాదనలు, అదేవిధంగా కొందుర్గు మినీ స్టేడియం, షాద్ నగర్ పాలిటెక్నిక్ కళాశాల, షాద్ నగర్లో ఐటీఐ కళాశాల, కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామంలో బస్టాండ్ నిర్మాణం, చౌదరిగూడ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాడ నగర్లో డయాలసిస్ కేంద్రం. నందిగామ తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం మంజూరీకై ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. అభివృద్ధి పెద్దఎత్తున చేపడుతుంటే ప్రతిపక్షాలు అధికార పార్టీపై ఆరోపణలు చేసేందుకు బజారులో వడ్డీ బట్టలు చింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. దశల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తిరుతుందని వీర్లపల్లి శంకర్ స్పష్ట చేశారు. ప్రతి కార్యకర్త నాయకుడు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఖచ్చితంగా వివరించాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. ప్రచార ఉద్యమంలో మీడియా కూడా సహకరించాలని ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి తమకు తోడ్పాటు అందించాలని తెలిపారు. నియోజకవర్గంలో రాజకీయాలకు కచ్చితంగా నిష్పక్షపాతంగా పాలిస్తానని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. గత పది ఏళ్లలో ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారని, కార్యకర్తలను నాయకులను మీడియా ప్రతినిధులను అన్ని వర్గాలను బాధపెట్టారని, తాను మాత్రం అలా చేయకూడని అన్నారు. ప్రశ్నించే వారికి గట్టిగా సమాధానం చెబుతామని, చేయాల్సివుంటే చేస్తామని చెబుతామని చేసింది ఉంటే తప్పకుండా వివరిస్తామని అన్నారు. ఎక్కడ రాజకీయ భేష జాలాలకు పోనని అన్నారు.
ఈ మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి
వీరేశం, జంగ నర్సింహ్మ యాదవ్, రాజు, సుదర్శన్ గౌడ్, హరినాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్రాజ్ గౌడ్, చెంది తిరుపతిరెడ్డి, పురుషోత్తం రెడ్డి, సీతారాం, లింగారెడ్డిగూడెం అశోక్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు విజేందర్ రెడ్డితో కలిసి చిట్యాల రామచంద్రంకు ఘన నివాళులు మనోరంజని ప్రతినిధి…

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మద్యం ప్రియులకు బాధాకరమైన వార్త ఏమి టంటే? రంగుల హోలీ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్