శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని.. మీ కష్టాలకు ముగింపు మీ విజయాలకు ఆరంభం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విశ్వా వసు అంటే విశ్వాసం, నమ్మకమని అ దిశగా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రభుత్వాలు నిలుపుకోవాలన్నారు. ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలని తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది అన్నారు. ఈ పదిహేను నెలల్లో ప్రజా సంక్షేమ రాష్ట్ర అభివృద్ధి పేరు ప్రతిష్టలు తిరో గమానం లోకి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తో మండుటెండల్లో చెరువులు, చెక్ డ్యామ్ లు మత్తళ్లు దుంకుతున్నాయని అన్నారు. కొంత ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరణి తో సాగు నీటి ఇబ్బందులు తలెత్తి రైతులు ఆందోళన చెందుతున్నరన్నారు. ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురువాలని, రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. అన్నింటా శుభం జరగాలని భాగవతుణ్ణి ప్రార్థించారు. ఈ కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం