

తెలుగువారి కొత్త సంవత్సరోత్సవం అయిన ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో కిషన్ రెడ్డి పాల్గొని, పండితులు తెలిపిన భవిష్య వాణిని ఆలకించారు. నూతన సంవత్సరం ప్రజలకు శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.