

శ్రీ వందన ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు అభినందనీయం –
వి. సత్యనారాయణ గౌడ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో శ్రీ వందన ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భాజపా నాయకుడు, ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఆసుపత్రి యాజమాన్య సభ్యులు వి. సురేష్ గౌడ్, సతీష్, గౌరవ డాక్టర్ ప్రసాద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఉచిత వైద్య సేవలు అందించాలనీ, సామాజిక సేవలో భాగస్వాములుగా కొనసాగాలని సూచించారు. శ్రీ వందన ఆసుపత్రి అందిస్తున్న సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కడ్తాల్ మాజీ సర్పంచ్ దేవేందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బర్మ రాజ నరసయ్య, పిఎసిఎస్ఏ వైస్ చైర్మన్ బి. గంగాదాస్, మాజీ ఉపసర్పంచ్ బొజ్జ భీమేష్, రంజిత్ గౌడ్, రహమత్, పసుపుల అశోక్, ఇబ్రహీం, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
