

శ్రీ నాగభూషణ విద్యాలయంలో ఉగాది వేడుకలు
మనోరంజని ప్రతినిధి బాసర మార్చి 29 :- నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శ్రీ నాగభూషణ విద్యాలయం లో ముందస్తు ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ విశ్వ వాసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గణపతి కలుష తదితర పూజలు వేద పండితుల చేత సనాతన ధర్మం దుస్తుల తో చేపట్టి వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేద పండితులు పంచాంగ పట్టణం చేపట్టగా ఈ సంవత్సరం రైతులకు ప్రతి పక్షిప్రానికి మంచి లాభదాయకం ఉందని ముఖ్యంగా ఆరంగాలు కష్టపడే రైతులకు సమృద్ధిగా వర్షాలు పడి అధిక దిగుబడి పంటలను తీస్తారని గోదావరి పక్షులకు మంచినీరు ఎల్లప్పుడూ ఉంటుందని అందరు ప్రజలు సుఖశాంతులతో ఉంటారని నిత్యం దైవనామస్వారణతో ప్రతి ఒక్కరు స్మరిస్తే ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జే బాబురావు వైస్ ప్రిన్సిపాల్ సులోచన వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ ఇన్చార్జి సంతోష్ గారి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు