

శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!
మనోరంజని ప్రతినిధి శ్రీశైలం మార్చి 16 -ఏపీలో శ్రీశైలం హైవేలో ట్రాఫిక్ తీరుతెన్నులపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహించనుంది. ఇప్పటికే ఓ సారి సర్వే పూర్తవ్వగా.. రూ.7,668కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికిగాను సమగ్ర ప్రాజెక్టు నివేదిక(DPR)ను కేంద్రానికి సమర్పించింది. ఈ సర్వే ప్రకారం ఈ రోడ్డుపై రోజుకు సగటున 7,181వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు తేలింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్రం రీసర్వేకు ఆదేశించింది