

శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
‘పుష్ప 2’ బెనిఫిట్ షో సమయంలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే 3 నెలలుగా చికిత్స కొనసాగుతున్నప్పటికీ నరాల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించలేదని వైద్యుల తెలిపారు. శ్రీతేజ్ కేవలం కళ్లు మాత్రమే తెరవగలుగుతున్నాడని.. ఎవరినీ గుర్తు పట్టడం లేదని పేర్కొన్నారు. ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ద్వారా ఆహారం అందిస్తున్నట్టు, అలాగే ఫిజియోథెరపీ కొనసాగిస్తున్నామని వెల్లడించారు.