శేర్లింగంపల్లి లో రంజాన్ సందర్భంగా తోఫాను అందజేసిన డా. రవీందర్ యాదవ్.

శేర్లింగంపల్లి లో రంజాన్ సందర్భంగా తోఫాను అందజేసిన డా. రవీందర్ యాదవ్.

గిఫ్ట్ ఏ స్మైల్ బ్యాగులలో నిత్యవసర సరుకుల సరఫరా

మా నాయకుడు రవీందర్ యాదవ్ అని ముస్లిం సోదరుల ఆశీస్సులు

తామంతా రవీందర్ యాదవ్ వైపే నని ముక్తకంఠంతో ఆశీర్వదించిన ముస్లిం సోదరులు

శేరిలింగంపల్లిలోని స్థానికులకు నిత్యావసర సరుకులు అందజేత

కేటీఆర్ పిలుపు మేరకు ముస్లింలకు గిఫ్ట్ ఏ స్మైల్ తో కూడిన బ్యాగ్ లు

పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ ను నిషేదిద్దాం అని పిలుపు

కేసీఆర్ పాలనలోనే ముస్లింలకు అభివృద్ధి ఫలాలు

సీఎం రేవంత్ తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ యాదవ్

మనోరంజని, హైదరాబాద్ ప్రతినిధి:
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలకు భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తోఫాను అందజేశారు. శేరిలింగంపల్లిలోని స్థానిక ముస్లింలకు నిత్యావసర సరుకులను అందించిన రవీందర్ యాదవ్.. వారికి రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు. భారాస వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ తో ముద్రించిన బ్యాగ్ తో పాటుగా నిత్యావసర సరుకులను అందజేసినట్లుగా వెల్లడించారు. కేటీఆర్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. మనకు తోచిన విధంగా సహాయం చేద్దామని కోరారు. బ్యాగ్ లపై ప్లాస్టిక్ ను నిషేదిద్దాం అని పిలుపుతో పర్యావరణాన్ని కాపాడేందుక అందరూ సహకరించాలని విజ్నప్తి చేశారు. అలాగే ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ ను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని వెల్లడించారు. భారాస పాలనలో ముస్లింలకు అండగా నిలిచారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో మైనార్టీలకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని విమర్శించారు. ముస్లింలే కాదు సబ్బండ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. షాదీ ముబారక్ తో పేద ముస్లింల వివాహానికి పెద్దన్నలా కేసీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పడు జరిగినా భారాసనే అధికారంలోకి రాబోతుందని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం