

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ముఖ్యపాత్ర పోషిస్తుంది.
*మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.మార్చి 27 – -భీమారం మండల కేంద్రంలో శ్రీరామచంద్ర మిషన్ మరియు హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో గీతా హై స్కూల్ (గుడ్ మార్నింగ్ స్కూల్) నందు ఈనెల 24,25, 26, మూడు రోజులపాటు ఉచితంగా నిర్వహించిన యోగా ధ్యానోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమారం ఎస్సై పాల్గొనడం జరిగింది. ఈ మూడు రోజుల కార్యక్రమంలో దాదాపుగా 46 మంది గ్రామస్తులు పాల్గొని యోగా ధ్యానం యొక్క ప్రయోజనాలను అనుభవ పూర్వకంగా గుర్తించడం జరిగింది. పాల్గొన్న వారిలో కొందరు మాట్లాడుతూ ఇది వారికి శారీరకంగా మానసిక ఆరోగ్యంగా ఉపయోగపడిందని అభిప్రాయo వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం తరువాత సంస్థ ట్రైనర్ పర్ష శ్రీనివాస్ మాట్లాడుతూ గీత హై స్కూల్ లో మూడు రోజులు యోగ మరియు ధ్యాన కార్యక్రమం నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి కి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇదే విదంగా ప్రతి ఆదివారం ఉదయం 7.30 నిమిషాలకు గీతా హై స్కూల్ ల్లోనే యోగా ధ్యానం సాధన కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సహకరించిన పోటు మురళీధర్ రెడ్డి, లక్ష్మి నారాయణ, వెంకన్న, జ్యోతి, పద్మ గార్లకు కూడా సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
