శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి –

శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి –

బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డిమాండ్

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 29 :- శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేయాల్సిన ఇంజనీరింగ్‌ కళాశాలను హుస్నాబాద్‌లో నెలకొల్పడం సరైన నిర్ణయం కాదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కరీంనగర్ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్ అన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులను రద్దు చేసి యూనివర్సిటీ క్యాంపస్‌లోనే కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.”హుస్నాబాద్‌లో కళాశాల ఏర్పాటుతో విద్యార్థులకు వసతి, రవాణా సమస్యలు వస్తాయి. కరీంనగర్‌లోనే కళాశాల ఉంటే ప్రభుత్వ హాస్టల్స్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి” అని అన్నారు.అధికారంలో ఉన్నట్లు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సముద్రల ఓంకార్, సయ్యద్ షోహైల్, మడిశెట్టి అజయ కుమార్, నాయిని అన్వేష్, మామిడిపల్లి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం