మనోరంజని ప్రతినిధి మార్చి11 - కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామి దర్శనానికి సంబంధించి పలు మార్పులు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. మెట్లను ఎక్కిన వెంటనే ప్రస్తుతం భక్తులను ఒక వంతెన మీదికి మళ్లించి తర్వాత స్వామి దర్శానానికి అనుమతిస్తున్నారు. అయితే ప్రస్తుతం 18 పవిత్ర మెట్లను అధిరోహించిన వెంటనే భక్తులు నేరుగా స్వామిని దర్శించుకునేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త పద్ధతిని ఈ నెల 15 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు