వ్యాపారస్తులు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి
ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 12 :- వ్యాపారస్తులు విధిగా ఫుడ్ లైసెన్స్ ను తీసుకోవాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన ముధోల్ లోని కిరాణా షాపులను విస్తృతంగా తనిఖీ చేశారు. వ్యాపారస్తులు విక్రయిస్తున్న వస్తువులను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు సైతం దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తయారు తేదీతో పాటు కాలం తీరిన తేదీలను సరి చూసుకోవాలని అన్నారు. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులకు రసీదులను సైతం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారస్తులు సైతం దుకాణాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతి ఇవ్వాలని ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫుడ్ లైసెన్స్ ను తీసుకొని వ్యాపారస్తులు కచ్చితంగా తీసుకోవాలని పేర్కొన్నారు. దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట సిబ్బంది, తదితరులు ఉన్నారు