వైభవోపేతం పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
తరలివచ్చిన అశేష భక్తజనం
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 11 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం వైభవపీతంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో చేపట్టిన కళ్యాణ ఘట్టం కమనీయంగా కొనసాగింది. ఉదయం వేళ మాడ వీధుల్లో స్వామివారిని, పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి, భక్తులు పెళ్ళికొడుకు, పెళ్లికూతురు బంధువులుగా మారి వేడుకలనుb జరుపుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక కల్యాణ మండపం ఏర్పాటుచేసి కళ్యాణ ఘట్ట ప్రాముఖ్యతను వేద పండితులు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు, వేదపండితులు చేపట్టిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని స్వాగతించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ అనంద్ రావ్ పటేల్, నాయకులు విలాస్ గాదేవార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ తో పాటు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పలువురు పాల్గొన్నారు