మనోరంజని ప్రతినిధి భైంసా, మార్చి 04: వైద్య సేవలు అందించడమే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు రక్తదానం చేసి ప్రాణాలు నిలిపేందుకు ముందుకొచ్చిన డాక్టర్ ముత్యం రెడ్డి మానవత్వానికి నిదర్శనమయ్యారు. మహారాష్ట్రలోని కిని గ్రామానికి చెందిన ఓ రోగి భైంసాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.సోమవారం రోగికి ‘ఓ పాజిటివ్’ రక్తం అత్యవసరం కావడంతో, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ముత్యం రెడ్డి స్వయంగా జీవన్ దాన్ రక్తనిది కేంద్రంలో రక్తదానం చేసి, రోగి ప్రాణాలను కాపాడారు. ఆయన మానవత్వానికి నెటిజన్లు, లైన్స్ క్లబ్ సభ్యులు, పలువురు అభినందనలు తెలిపారు.