

వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
కడప: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కీలక సాక్షి రంగయ్య(70) మృతి చెందారు. వివేకా నివాసంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన రంగయ్య పలు ఆరోగ్య సమస్యల కారణంగా కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
2019 మార్చి 15న మాజీ మంత్రి వివేకానందరెడ్డి అతి దారుంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య జరిగిన రోజున రంగయ్య ఇంట్లోనే ఉండటంతో సీబీఐకి ఆయన వాంగ్మూలం ఇస్తూ కీలక అంశాలు బయటపెట్టారు. ఇలా వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగయ్యకు గతంలో సీబీఐ గన్‌మెన్లను కూడా కేటాయించింది. కాగా, వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రంగయ్య.. నేడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు..