వివాహేతర సంబంధం.. ప్రియుడే యముడయ్యాడు! భర్తలేని టైమ్‌లో ఇంటికొచ్చి ప్రాణాలు తీసిన ప్రియుడు

వివాహేతర సంబంధం.. ప్రియుడే యముడయ్యాడు! భర్తలేని టైమ్‌లో ఇంటికొచ్చి ప్రాణాలు తీసిన ప్రియుడు

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి.

వాటి కారణంగా పచ్చటి కాపురాల్లో చిచ్చులే కాకుండా కొన్ని సార్లు జీవితాలే బలవుతున్నాయి.

తాజాగా వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది.

చక్కగా భర్త, పిల్లలు ఉన్న ఆమె జీవితంలోకి స్నేహం పేరుతో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత వివాహేతర సంబంధంగా మారి.. చివరి ఆమె ప్రాణాలు తీసే కాల యముడు కూడా అతనే అయ్యాడు.

అన్యాయంగా మహిళను చంపి హంతకుడిగా మారాడు

విజయవాడ నిడమనూరు కావ్య రెయిన్‌బో హాస్పిటల్ లో గతంలో ఆయా గా పని చేసింది.

సమయంలోనే నిడమానూరుకు చెందిన వాసు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. తరువాత కొంతకాలం ఫోన్లో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు కలుస్తుండేవారు. ఈ విషయం కావ్య భర్త ప్రకాష్‌కు తెలిసిందే. భార్య చేస్తున్న ఈ పనికి ఎంతో బాధపడిన ప్రకాష్‌.. ఇలా చేయడం సరికాదని, ఇకనైనా మంచిగా ఉండాలంటూ ఆమెను మందలించి, ఆ హాస్పిటల్లో ఆయా ఉద్యోగం మాన్పించి ఇంటి వద్దే ఉంచాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నా.. మళ్లీ ప్రియుడు వాసు తరచూ ఫోన్లు చేస్తూ.. తనతో ఫోన్లో మాట్లాడాలని, వివాహేతర బంధం కొనసాగించాలని ఒత్తిడి తెచ్చాడు.

అయితే భర్త భయంతో ఆమె వాసును దూరం పెట్టడంతో ఈ విషయంలో తీవ్రంగా ఆగ్రహించిన వాసు అనేకు మార్లు నాతో ఫోన్ మాట్లాడమని లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. ఇక చివరికి ఆదివారం అంటే మార్చ్‌ 2, 2025 తెల్లవారు జామున ప్రకాష్‌ ఇంట్లో లేని సమయంలో కావ్య ఇంటికి వెళ్లాడు వాసు. నీతో కాస్త ఏకాంతంగా మాట్లాడలని, ఆమెను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఏమైందో ఏమో కానీ, ఆమె మెడకు చున్నీతో గట్టిగా బిగించి, చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై మృతురాలి భర్త ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

  • Related Posts

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని గోపాల్ పేట్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదాలలో ఒకరికి తీవ్రగాయాలు అయినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు పోలీసులు…

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు జెత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన కేసు ఇప్పటికే సస్పెండ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు మనరంజని రంగారెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే