

వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 18 :- నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో గల తుల్జాభవాని మాత ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి అభిషేకం, దూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక అలంకరణతో పాటు భక్తులకు ప్రసాద వితరణ చేశారు.ఆలయ నిర్వాహకురాలు పోలాస భాగ్యశ్రీ మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. వచ్చే శుక్రవారం ఓ భక్తురాలి కోరిక మేరకు తొలిసారిగా గొందళ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విశేష కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి దీవెనలు పొందాలని కోరారు. ఆలయ నిర్వాహకులు పోలాస భాగ్యశ్రీ, సత్యనారాయణ మాట్లాడుతూ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులందరూ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు.